అభివృద్ధి విధ్వంసం..కరోనా కల్లోలం

అన్నింటా ఇదే పరిణామం

అభివృద్ధి విధ్వంసం..కరోనా కల్లోలం

కాలం వెళ్లిపోతూ కొండంత దుఃఖాన్ని మిగిల్చిపోతుంది. కొన్ని మాటాలకు అర్థాలు ఎంతగానో మారిపోతున్నాయి. గత రెండు మూడు నెలలుగా ‘కరోనా అన్న మాట ఒకటే వాడుతున్నాం.

తెలుగులో కరోనా అంటే చంద్రుని, సూర్యుని చుట్టూ ఉండే సన్నని వలయాన్ని లేక గీతను కరో నా అంటారు.కాని కరోనా అనేది ఒక భయపెట్టే మాట అయి పోయింది ఇప్పుడు.

కరోనా విషయాలను వివరించేటప్పుడు కార్యకారణ సంబంధాలని చాలా శాస్త్రీయంగా, సహేతుకంగా కొత్త కోణంతో విశ్లేషించాలి. సామాజిక, ఆర్థిక, రాజకీయ అనుభవాన్ని అర్థం చేసుకోవడానికి కొత్త కోణంలో ఆలోచిం చడం ఎంతో అవసరం.

కాని మన దేశంలో కొంతమంది మతవాదులు ఆవ్ఞమూత్రాన్ని సేవించడం,యజా లు, యాగాలు చేయడం వలన నిరోధించవచ్చని, తెలంగాణ లో కొన్ని గ్రామాలలో వేపచెట్టుకు నీళ్లు పోస్తే వ్యాధి సోకదని నమ్మకంతో ఊళ్లో వేపచెట్లకు గుంపులు గుంపులుగా నీళ్లు పోస్తున్నారు.

నిజానికి కరోనాకు మతం లేదా అభివృద్ధి దీనికంతటికి కారణామా? అనేది ప్రశ్న? మతపరమైన కార ణాలు పాపాలు, నీతి నిజాయితీ తప్పడం వల్లనే దీనికంతటి కారణం అని మతవాదులు వాదిస్తారు.

దీనికి అసలైన కారణం రాజకీయ, సామాజిక, ఆర్థిక దోపిడి,కరువ్ఞ కాటాకాలు, వాతా వరణ, కాలుష్యం, ప్రకృతి వైపరిత్యాలు, కారణాల రీత్యా ప్రజలు ఒక ప్రాంతం నుండి ఇంకొంక ప్రాంతం లేదా దేశాలకు వలస వెళ్లతారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలలో నిరక్ష్యరాస్యత, మూఢనమ్మకాలతో సమాజం నిండి ఉంటుంది.

ప్రతి దానిని దేవ్ఞడు, దయ్యం, పాపం, పుణ్యంతో ముడివేస్తారు.

దీనికి తోడు స్వాములు, బాబాలు, పూజారులు యోగాలు, హోమాలు చేయడం వలన కొవిడ్‌-19ను నివారించవచ్చు అనేది వాళ్ల నమ్మకం.

ఆది మానవ్ఞడు వాళ్లకు పురాణ గాధలు, కల్పితాలు ఇవన్నికూడా వాళ్ల జీవిత అనుభవంతో రంగరించి కల్పించుకున్న శాస్త్రీయ పరమైన గాథలు. వీటికి శాస్త్రీయత ఉంటుంది.

అంటే వాళ్లు ప్రతి విషయాన్ని నిరూపించగల్గుతారు. అవన్ని కూడా జీవిత సత్యాలు. పారిశ్రామిక విప్లవం తర్వాత శాస్త్ర సంకేతికపరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందింది.

దీని మూలంగా సైన్స్‌, శాస్త్ర వేతలు మతం అంటే కల్పితమని, అవాస్తవమని, ఇదొక కల్పి త కథగా పారేసారు.

ఆదిమానవ్ఞని ప్రపంచం ఒక భూట కమని వాళ్ల ప్రపంచం అంతా మూఢనమ్మకాలతో ఉంటుందని సమాజానికి వీళ్ల ఆలోచన వలన ఉపయోగం లేదని ఏమాత్రం పట్టిచుకోలేదు.

ఆదిమానవ్ఞడు ప్రకృతిపై తమ సర్వాధిపత్యాని కోల్పోతున్న పరిస్థితుల్లో మనిషి పరాయికరణకు గురికావడం జరిగింది.

చారిత్రక పరిణామ క్రమంలో ప్రకృతి నుంచి పరా యీకరించిందే నాగరికత లేక అభివృద్ధి. అభివృద్ధి అంటే ఏమిటి? ఈ ప్రాంతంపై నీకు హక్కులేదు.

ఈ అడవి సంప దపై నీకు హక్కులేదు. అన్ని సందర్భాలలో హక్కులేదని ఆదిమానవ్ఞణ్ణి నాగరికులు శాసించారు.

ఆ తర్వాత ప్రపంచీ కరణలో భాగంగా పెట్టుబడిదారులకు, కంపెనీలకు వ్యాపా రాలు చేయడానికి ఉన్న నిబంధనలను వాళ్లకు స్వేచ్ఛను ఇచ్చారు. దీనివల్ల వాళ్లు పరిశ్రమలను సులభంగా పెట్టుకో వచ్చు.

దిగుమతులు, ఎగుతులు సులభంగా చేసుకోవచ్చు. కాలుష్య నియంత్రణ బోర్డు, కార్మికశాఖ అధికారులు అందరు వాళ్లకు లైసెన్సులు ఇస్తారు. ఇలా సరళీకరణం చేయడంవలన బహుళజాతీయ కంపెనీలు తమవ్యాపారాన్ని అదుపు లేకుండా కొనసాగించారు.

కాబట్టి అభివృద్ధి అనేది అందరికి అది కఠినం గా అయింది. అందువలన కరోనా చెడ్డమాట అయింది.
ఇప్పుడు అభివృద్ధి కూడా అట్లాంటిదే అయిపోయింది.

అభివృద్ధి సమాజానికి ఎంత ప్రయోజకరమో అంతా ప్రమాదకరం కూడా. సమస్య ఎక్కడొచ్చిందంటే దేనిని అభివృద్ధి అంటు న్నామో దాని అర్థం మారింది.

అవి రాజకీయ, సామాజిక, పెట్టుబడిదారి వ్యవస్థ, ఆర్థిక అసమానతలు, హింస, ఆయుధాలు, స్వార్థం, ధనవ్యామోహం, మొదలగు కారణాల వలన ప్రకృతి విధ్వంసానికి గురైంది.

అభివృద్ధి మూలంగా సమాజంలో అక్షరాస్యత, ఆరోగ్యం, జీవన పరిణామాలు, ఆర్థిక, రాజకీయ అసమానతలు అవకాశాలలో సౌకర్యాలలో అసమానతలు కొంతవరకు తగ్గించబడింది.

చరిత్రలో కొన్ని విలువలు ముందుకొస్తుంటాయి. కొన్ని పతనం అవ్ఞతూ ఉంటాయి. సమాజంలో వివిధ వర్గాల ఆధిపత్యం కొనసాగు తూ ఉంటుంది.

భారతదేశంలో సంపద కొద్దిమంది చేతిలో కేంద్రీకరించబడి ఉంది. 71శాతం సంపద, ఒక శాతం ధనిక వర్గంలో ఉంటే ఒక శాతం సంపద పేద ప్రజల దగ్గర ఉంది.

అంటే చాలా మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. కాని ధనిక వర్గం తమ పెత్తనాన్ని కొనసాగిస్తున్నాయి.

ఆ పెత్తనం చెలాయించే రూపాలలో తేడాలుంటాయి. లక్షల కోట్ల విలువ చేసే ఖనిజ సంపద, సహజవనరుల దోపిడి కార్పొరేట్‌ శక్తు లకు అత్యంత అవసరమయ్యాయి.

దేశ సంపదను సామ్రాజ్య వాదులకు ధారదత్తం చేయడం అభివృద్ధిగా ప్రచారం చేయడం దాని మూలంగా పర్యావరణ విధ్వంసం జరిగింది.

అభివృద్ధి అంటే గ్రోత్‌, జిడిపి, జిఎన్‌పి, పర్‌ క్యాపిటల్‌ ఇన్‌కమ్‌, కార్లు బంగ్లాళ్లు, రియల్‌ ఎస్టేట్స్‌, లాభాలు, దోపిడీ, అవినీతి ముడిపడి ఉంటుంది.

దీని మూలంగా లక్షలాది ప్రజ లు ఆకలితో అలమటిస్తున్నారు. లక్షలాదిమంది వసల కూలీ లుగా మారుతున్నారు.

నాగరిక సమాజం మానవ్ఞలందరిని సమిష్టి సంపదను దోపిడీ వర్గాలు ప్రకృతి మీద ఆధిపత్యం చేయడానికి సైన్స్‌ ద్వారా ఎన్నో ప్రయోగాలు చేస్తాడు.

కరోనా విషయంలో కొంత మంది స్వాములు, బాబాలు, పురోహితు లు యజ్ఞం, యాగాల ద్వారా నివారించవచ్చు అనేది సమాజ వ్యతిరేకమైనది.

ఎతిక్స్‌లో సైన్స్‌లో మంచిని అనుసరించవలసి ఉంటుంది.

ఈ రెండు కూడా సమాజ పురోగాభివృద్ధికి అవస రం. కరోనా లాంటి వ్యాధులు ప్రబలడానికి కారణం అభివృద్ధి విధ్వంసం. దాని మూలంగా సమాజం అల్లకల్లోలం అవ్ఞ తుంది.

జాతి భవిష్యత్తును గురించి నేడు చర్చ జరుగుతుంది. ఏరకమైన అసమానతలు లేని, అణచివేత దోపిడీ లేని ప్రపంచం కావాలని అందరం కోరుకుందాం.

– ప్రొ.ఆర్‌.రాందాస్‌

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/