అమెరికాలో 419కి చేరిన కరోనా మృతులు

ఒక్కరోజులోనే 100 మరణాలు..బాధితుల సంఖ్య 33,546

coronavirus america
coronavirus america

వాషింగ్టన్‌: ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుంది. చైనా, ఇటలీ తర్వాత కరోనా బాధితులు అత్యధికంగా ఉన్న దేశం అమెరికానే. ఇప్పుడక్కడ 33,546 మంది కరోనా పాజిటివ్ వ్యక్తులున్నారు. మృతుల సంఖ్య 419. అయితే, ఒక్క రోజు వ్యవధిలో 100 మరణాలు చోటుచేసుకోవడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మండిపడ్డారు. సకాలంలో చైనా తమతో సమాచారం పంచుకోని కారణంగానే ఈ మహమ్మారి విజృంభిస్తోందని ఆరోపించారు. మొదట్లోనే చైనా ఈ వైరస్ గురించి తమకు సమాచారం అందించి ఉంటే బాగుండేదని, చైనా వైఖరి తమకు అసంతృప్తిని కలిగించిందని అన్నారు. కానీ తాను చైనాలా ఎప్పటికీ వ్యవహరించనని ట్రంప్ స్పష్టం చేశారు. కాగా, అమెరికాలోని పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. అత్యధికులు ఇళ్లకే పరిమితమయ్యారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/