అమెరికాలో 31కి చేరిన కరోనా మృతులు

1000 దాటిన కరోనా బాధితుల సంఖ్య…ఒక్క వాషింగ్టన్ లోనే 24 మంది మృత్యువాత

Coronavirus death toll in US increases to 31
Coronavirus death toll in US increases to 31

అమెరికా: చైనాతో పాటు పలు దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) అమెరికాలో సైతం కలవరం రేపుతుంది. ఈనేపథ్యంలో అమెరికాలో ఈవైరస్‌తో మృతుల సంఖ్య 31కి చేరింది. మరో 1000కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నిర్థారణ అయ్యాయి. వీరిలో 24 మంది వాషింగ్టన్ నగరంలోనే చనిపోయారు. అమెరికాలో జనవరి 21న తొలి కరోనా కేసు నమోదైంది. అప్పటినుంచి కొన్ని వారాల వ్యవధిలోనే కరోనా విస్తృతమైంది. 38 రాష్ట్రాల్లో ఈ మహమ్మారి ప్రభావం ఉన్నట్టు అధికారవర్గాలు గుర్తించాయి. ఈ నెల మొదటివారంలో 70గా ఉన్న కేసుల సంఖ్య, కొన్నిరోజుల వ్యవధిలోనే 1000కి చేరడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. కరోనా ప్రభావం అధ్యక్ష ఎన్నికలపైనా పడింది. అభ్యర్థులు తమ సభలను వాయిదా వేసుకోకతప్పలేదు. సాధారణ జనజీవనం కూడా మందగించింది. షాపింగ్ మాల్స్ మూసేశారు. కళాశాలల్లో క్లాసులు రద్దు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/