1000కి పైగా కరోనా వైరస్‌ మృతులు

Coronavirus
Coronavirus

బీజింగ్‌: చైనాలో కరోనా వైరస్‌తో మృతుల సంఖ్య రోజురోజూకు పెరిగిపోతుంది. తాజాగా సోమవారం ఒక్కరోజే 108 మంది మృతచెందనట్లు జాతీయ ఆరోగ్యకమిషన్‌ తన నివేదికలో తెలిపింది. తాజాగా మరో 42,638 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా ఒక్క హుబె§్‌ు ప్రావిన్సులోనే సోమవారం 103 మంది మృతిచెందారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మఖానికి మాస్‌ ధరించి సోమవారం బీజింగ్‌లో పర్యటించారు. మరోవైపు బీజింగ్ లో కరోనా సోకినవారు చికిత్స పొందుతున్న ఆసుపత్రిని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సందర్శించారు. వైద్య సిబ్బందిని, రోగులను ఆయన కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనాను అరికట్టడానికి మరిన్ని మెరుగైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు చైనా అధికారిక వార్తా సంస్థ సీసీటీవీ వెల్లడించింది.

మరోవైపు, అంతర్జాతీయ వైద్య నిపుణులతో కూడిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు చెందిన బృందం నిన్న రాత్రి చైనాకు చేరుకుంది. ఈ బృందానికి బ్రూస్ ఐల్వార్డ్ నాయకత్వం వహిస్తున్నారు. 2014-16 మధ్య కాలంలో పశ్చిమ ఆఫ్రికాను ఎబోలా వైరస్ వణికించినప్పుడు కూడా డబ్ల్యూహోఓ తరపున కార్యకలాపాలను ఆయనే పర్యవేక్షించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/