ఏపిలో మరో 48 మందికి కరోనా

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,205

corona virus
corona virus

అమరావతి: ఏపిలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో 9,628 శాంపిళ్లను పరీక్షించగా మరో 48 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో కరోనాతో 24 గంటల్లో మరొకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు ఏపిలో మృతి చెందిన వారి సంఖ్య 49కి చేరింది. అదే సమయంలో 101 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,205గా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 803 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,353 మంది డిశ్చార్జ్ అయ్యారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/