ఈశాన్య భారతాన్ని తాకిన కరోనా
ఇంపాల్ లో తొలి కేసు నమోదు

ఇంపాల్: కరోనా మహమ్మారి దేశంలో ఏ ప్రాంతాన్ని వదలకుండా అల్లుకుపోతుంది. ఇప్పటి వరకు ఉత్తర, దక్షిణ భారతదేశంలో విస్తరించిన కరోనా ఇపుడు ఈశాన్య భారతంపై పడింది. తాజాగా మణిపూర్లో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. ఉత్తర ఇంపాల్ కు చెందిన ఒక వ్యక్తి ఇటీవల యూకే నుండి వచ్చాడు, అతడికి ఈ వైరస్ సోకినట్టు వైద్యులు నిర్దారించారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తుండగా, అతని ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/