18 అడుగుల వరకు వెళుతున్న వైరస్

నికోసియా వర్శిటీ పరిశోధకులు

6 feet apart may not be enough to stop COVID

కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు ఆరు అడుగుల భౌతిక దూరాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆరు అడుగుల దూరంతో కరోనా సోకకుండా అడ్డుకోలేమని నికోసియా యూనివర్శిటీ పరిశోధకులు అంటున్నారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తి, చిన్నగా దగ్గితే, ఆ సమయంలో గంటకు 4 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తున్నా, ఐదు సెకన్ల వ్యవధిలోనే వైరస్ 18 అడుగుల దూరం వరకూ వెళ్లిపోతుందని తమ పరిశోధనల్లో గుర్తించామని వారు తెలిపారు. ఈ కారణంతో ఎత్తు తక్కువగా ఉండే పెద్దలు, చిన్న పిల్లలకు మరింత త్వరగా వైరస్ క్రిమి చేరుతుందని పరిశోధకులు హెచ్చరించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/