ఔషధాల ఎగుమతులపై ఆంక్షలు విధించిన భారత్‌

భారత్‌లో కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఔషధాల సమస్య లేకుండా కేంద్ర దృష్టి

corona-virus-india-curbs-drug-exports
corona-virus-india-curbs-drug-exports

న్యూఢిల్లీ: భారత దేశంలో కూడా కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా ఔషధాల లభ్యతకు సమస్యలు లేకుండా చూడటంపై కేంద్ర దృష్టి సారించింది. ఇందులో భాగంగా 26 యాక్టివ్‌ ఫార్మా ఇంగ్రీడియంట్స్‌ (ఏపీఐ), ఔషధాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. పారాసిటామాల్‌, విటమిన్‌ బీ1, బీ12 మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. తాజా ఆంక్షలతో ఇకపై వీటి ఎగుమతులపై కోసం డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) నుంచి సరఫరా దెబ్బతిన్న కారణంగా…దేశీయంగా ఏపీఐలు, ఔషధాల కొరత తలెత్తకుండా కేంద్రం తాజా చర్యలు తీసుకుంది. కేంద్ర ఫార్మా విభాగం ఏర్పాటు చేసి అత్యున్నత స్థాయి కమిటీ ఈమేరకు సిఫార్సులు చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/