వైరస్‌ ఆ ల్యాబ్‌ నుండే వచ్చింది

ఆ ఆధారాలను తాను చూశానన్న..అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో

Mike Pompeo
Mike Pompeo

వాషింగ్టన్‌:  కరోనా వైరస్‌ చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌ నుండే పుట్టిందని మొదటి నుండి అమెరికా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈవిషయంకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అమెరికా తెలిపింది. ఈనేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మాట్లాడుతూ.. ఆధారాలను తాను స్వయంగా చూసినట్టు చెప్పారు. వుహాన్ నుంచే వైరస్ బయటకొచ్చిందని గతేడాది డిసెంబరులోనే చైనాకు తెలిసినా వారు వేగంగా స్పందించలేదని ఆయన ఆరోపించారు. కాగా అమెరికా ఆరోపణలపై చైనా తీవ్రంగా స్పందించింది. వుహాన్ ల్యాబ్‌ను ఫ్రాన్స్ భాగస్వామ్యంతో నిర్మించినట్టు పేర్కొన్న చైనా.. ఈ విషయం పాంపియోకు తెలిసినట్టు లేదని, అందుకే కట్టుకథలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/