ఇవాళ రాత్రికి 2.7 ల‌క్ష‌ల టీకా డోసులు రాక

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్

TS Health Minister Etala Rajender
TS Health Minister Etala Rajender

Hyderabad: తెలంగాణలో టీకాలు లేక ఆదివారం వ్యాక్సినేష‌న్ నిలిచిపోయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇవాళ రాత్రికి 2.7 ల‌క్ష‌ల టీకాలు రాష్ట్రానికి వ‌స్తాయ‌ని వివరించారు. . ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ బాధితుల్లో ల‌క్ష‌ణాలు లేవని , వైర‌స్ సోకిన 3-4 రోజుల‌కు గానీ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ని అన్నారు.

రాష్ట్రంలోని ఆసుప‌త్రుల్లో బెడ్స్ కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. ఇంకా 60 వేల బెడ్లు ఖాళీగా ఉన్నాయని, అంతేకాకుండా ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆక్సిజన్ ఉత్పత్తి అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని, ఇప్పటికిప్పుడు రాష్ట్రాలు ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోలేవని వివరించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ లేక‌ కర్ఫ్యూ విధించే అవకాశాలు లేవ‌ని , ప్రతి ఒక్కరు క‌రోనా నిబంధ‌న‌లను పాటించాల‌ని కోరారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/