వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వ్యాక్సిన్‌

నవంబర్‌ 1లోపు అందుబాటులోకి వస్తుందన్న అమెరికా ప్రభుత్వం

anthony-fauci

అమెరికా: కరోనా మహమ్మారి నియంత్రణకు నవంబర్‌ 1లోపు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుందని అమెరికా‌ ప్రభుత్వం ప్రకటించిన సంగతి విధితమే. అయితే ఈ విషయంపై అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచి స్పందించారు. అంత త్వరగా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం లేదని ఆంటోని ఫౌచి అన్నారు. అక్టోబర్‌ నాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని, తాను అనుకోవటం లేదని చెప్పారు. అయితే, వ్యాక్సిన్‌ రావడం అసాధ్యమేమీ కాదని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశముందని ఫౌచీ చెప్పారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏడాది లోపు ప్రపంచం తిరిగి సాధారణ పరిస్థితికి చేరుకోగలదని తెలిపారు. కరోనా కట్టడిలో నిపుణుల మార్గదర్శకాలను పాటించకపోతే, కరోనా ప్రభావాన్ని మరి కొన్నాళ్ల పాటు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/