కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

తెలంగాణ ప్రభుత్వానికి ఉత్తమ్ డిమాండ్

Uttam Kumar Reddy
Uttam Kumar Reddy

హైదరాబాద్‌: కరోనా నియంత్రణలో కెసిఆర్‌ ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. సిఎం కెసిఆర్‌ అసెంబ్లీ సాక్షిగా అనాలోచిత మాటలు మాట్లాడారు. కరోనా వ్యాధి చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి. పేదలకు ఉచిత వైద్యం అందించాలి. ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా వ్యాధి చికిత్సకు లక్షల రూపాయల బిల్లులు వేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో బిల్లుల నియంత్రణ చర్యలు చేపట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వరకు 2 లక్షల టెస్టులు మాత్రమే చేశారు. జిల్లాల్లో కరోనా టెస్టులు పెంచాలి. కరోనా వ్యాధిగస్తులకు ఆక్సిజన్ లభించడం లేదు. సరైన వసతులు కల్పించని అసమర్థ ప్రభుత్వం కెసిఆర్‌ది. కరోనా మరణాల్లో ఎక్కువ పేదలే ఉన్నారు. ప్రకృతి వైపరీత్యంగా పరిగణించి వారికి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి! అంటూ ఉత్తమ్ డిమాండ్ చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/