మా కుటుంబంలో ఆరుగురికి కరోనా

కర్నూలు ఎంపి డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ సంచలన ప్రకటన

mp sanjeev kumar
mp sanjeev kumar

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు ఎంపి డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ సంచలన ప్రకటన చేశారు. తన ఇంట్లో ఆరుగురికి కరోనా వైరస్‌ సోకిందని తెలిపారు. ఇందులో తన ఇద్దరు సోదరులు, వారి భార్యలు, అలాగే ఒకఅబ్బాయి, తన తండ్రి కి కూడా ఈ వైరస్‌ సోకిందని తెలిపారు . వ్యాధిసోకిన వారంతా ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు. కర్నూలులో కరోనా విజృంభణ అధికంగా ఉందని భారీగా కేసులునమోదు అవుతున్నాయని మీడియాలో వస్తున్న వార్తలను ప్రస్తావించిన మంత్రి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భారత్‌లో బిసిజి వ్యాక్సిన్‌ వాడుతుండడం వల్ల భారతీయులకు రోగనిరోధక శక్తి అధికమని అన్నారు. ఇతర దేశాల్లో నెలకొన్న పరిస్థితి ఇక్కడ రాదని చెప్పారు. రెడ్‌జోన్‌లు ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ పొడగింపు ఉంటుందని, గ్రీన్‌జోన్‌లలో దశల వారిగా లాక్‌డౌన్‌ నిబంధనలు ఎత్తివేసే అవకాశం ఉందన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/