‘బొమ్మరిల్లు’ భామకు కరోనా
3వారాలు సెల్ఫ్ క్వారంటైన్ లో గడిపానని వెల్లడి

‘బొమ్మరిల్లు’ హీరోయిన్ జెనీలియా దేశ్‌ముఖ్ కరోనా బారిన పడ్డారు.
తనకు కరోనా వైరస్ సోకినట్టు జెనీలియా స్వయంగా ప్రకటించింది. ప్రస్తుతం తాను కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నానని తెలిపింది.
తనకు ఎటువంటి కరోనా లక్షణాలూ లేవని, అయినా పరీక్షలో పాజిటివ్ రావడంతో పూర్తిగా మూడు వారాలు సెల్ఫ్ క్వారంటైన్ లో గడిపానని పేర్కొంది.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/