కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ఉద్యోగికి కరోనా

స్వయంగా వెల్లడించిన మంత్రిత్వ శాఖ

corona virus
corona virus

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భారత పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఉద్యోగికి కరోనా వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈరోజు వెల్లడించింది. అయితే సదరు ఉద్యోగికి నిన్న నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్‌ అని తెలిపినట్లు ట్వీట్‌: చేసింది. కాగా ఆ వ్యక్తి ఈ నెల 15వ తేదీని మంత్రిత్వ శాఖ కార్యాలయానికి హాజరైనట్టు తెలిపింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బాధితుడితో కాంటాక్ట్ అయిన ఇతర ఉద్యోగులందరూ సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లాలని ఆదేశించింది. అలాగే, కార్యాలయంలో తగిన రక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/