ఏపీలో 2,209 మంది చిన్నారులకు కరోనా
దఢ పుట్టిస్తున్న థర్డ్ వేవ్

Amaravati: కరోనా థర్డ్ వేవ్ ఆందోళన కలిగిస్తోంది. మూడో దశలో ఇపుడు చిన్నారులకు ముప్పుగా పరిణమిస్తుందని నిపుణులు హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో కరోనా మూడవ దశ ప్రభావం కన్పిస్తోంది మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో 8వేల చిన్నారులకు కరోనా సోకినట్లు రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లోనూ థర్డ్‌వేవ్ ప్రభావం ఏర్పడింది. గత రెండు వారాల్లో సుమారు 2.3 లక్షల కరోనా కేసులు నమోదు అయ్యాయి. అందులో 23,920 మంది 18 ఏళ్లలోపు పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఐదేళ్ల లోపువారు 2,209 మంది మంది ఉన్నారు. తూర్పు గోదావరిలో సుమారు 4,200 మంది చిన్నారులు కోవిడ్ బారిన పడినట్లుగా వైద్యులు నిర్ధారించారు. . చిత్తూరు జిల్లాలోనూ సుమారు 3,800 మంది పిల్లలు కరోనా సోకినట్లుగా తెలిసింది.
ఇదిలావుండగా , రాష్ట్రంలో సుమారు 30 లక్షలమంది చిన్నారులు వైరస్ బారినపడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో ముందస్తు చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది . చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఇప్పటికే ప్రత్యేక వార్డులు సిద్ధం చేస్తోంది.
ఒక శాతం మంది చిన్నారుల్లో ప్రమాదకరమైన ‘మల్టీ సిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (MIS-C) అటాక్ కావచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/