రానున్న రెండు నెలలు చాల జాగ్రత్తగా ఉండాలి

కరోనా మహమ్మారి ఉదృతి తగ్గిపోయిందని అంత అనుకుంటున్నారు కానీ ఈ మహమ్మారి ఇంకా మాయమైపోలేదు. ఉప్పెనలా ముంచుకొస్తుంది. సెకండ్ వేవ్ ఉదృతి ఇంకా నడుస్తుండగానే..మూడో వేవ్ మరికొద్ది రోజుల్లో మొదలు కాబోతుందని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది.

గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ క‌రోనాపై మున్ముందు ఎలా వ్య‌వ‌హ‌రించాలో చెప్పుకొచ్చారు. రానున్న రెండు నెల‌లు ఎంతో కీల‌క‌మ‌ని కేంద్రం అప్ర‌మ‌త్తం చేసింది. సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో అనేక పండుగలు ఉండటంతో కరోనా నియంత్రణలో ఆ రెండు నెలలే అత్యంత కీల‌క‌మ‌ని స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. వ్యాక్సిన్లు వ్యాధి నుంచి రక్షణ మాత్రమే కల్పిస్తాయని..ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరిస్తూ కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరారు. క‌రోనాను దృష్టిలో పెట్టుకుని అన్ని ర‌కాలుగా జాగ్ర‌త్త‌లు తీసుకుని పండుగలు జరుపుకోవాలని కేంద్రం ఆరోగ్య‌శాఖ అధికారులు సూచించారు. కరోనా ఫ‌స్ట్ వేవ్ స‌మ‌యంలో కూడా త‌గ్గిపోయింద‌ని అంత భావించి కరోనా జాగ్రత్తలు పాటించలేదు. దీంతో మహమ్మారి పంజా విస‌ర‌డంతో ప్రజలంతా ఖంగ్ తిన్నారు. ఫ‌స్ట్ వేవ్ కంటే సెకెండ్ వేవ్ ఎక్కువ ప్రాణ న‌ష్టం క‌లిగించింది. ఈ నేప‌థ్యంలో థ‌ర్డ్ వేవ్ త‌ప్ప‌ద‌నే హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని చెపుతున్నారు.