పరీక్షల్లో ఇండియా దూకుడు, పాజిటివ్ రేట్ ఓకే…!

ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నేడు కూడా 55 వేల కరోనా కేసులు మన దేశంలో వచ్చాయి. అయితే ఇండియా కరోనా పాజిటివ్ రేటు మాత్రం చాలా తక్కువగా ఉంది. భారతదేశంలో పాజిటివ్ రేటు యావరేజ్ గా చూస్తే 7.81% గా ఉంది. అయితే రోజువారీగా చూస్తే మాత్రం 3.8%గా ఉంది.

Corona cases in the country
Corona cases in the country

పది రాష్ట్రాల్లో ఇంకా పాజిటివ్ రేటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అక్టోబర్ 22 వరకు మన దేశంలో మొత్తం 10,01,13,085 నమూనాలను పరీక్షించారు . వీటిలో నిన్న 14,42,722 నమూనాలను పరీక్షించారు అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) పేర్కొంది. అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది కరోనా పరిక్షలు, కేసులు, మరణాల్లో.