వేగంగా కరోనా వ్యాపిస్తుంది: డబ్లూహెచ్‌వో

నివారణ ఒక్కటే ప్రస్తుత మార్గం,

WHO  chief
WHO chief

జెనీవా: కరోనా ఇపుడు శరవేగంగా విస్తరిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. అయినా దీనిని కట్టడి చేయడం సాద్యమేనని డబ్ల్యూహెచ్‌వో ఛీఫ్‌ ట్రెడ్రోస్‌ అథనోమ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించడమే కాకుండా, వీలైతే ఇంటికే పరిమితే కావాలన్నారు. వీటితో పాటు అనుమానితులు ఎవరైనా ఉంటే వారికి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని, నిర్ధారణ అయిన ప్రతి ఒక్కరిని, వారిని కలిసిన వారిని నిర్బందంలో ఉచంచాలన్నారు. అయితే దీనికి ఇంకా మందు కనుక్కోలేదని, వైద్యుల సూచన లేకుండా మందులు వాడి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దన్నారు. అయితే ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో యాంటిమలేరియా ఔషదం కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్నారు అని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/