ప్రమాదకరంగా మారిన కరోనా వ్యాప్తి

ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా వెల్లడి

Corona spread- become dangerous
Corona spread- become dangerous

New Delhi: తాజాగా కరోనా వైరస్ విస్తరణ దేశంలో ప్రమాదకరంగా మారిందని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా పేర్కొన్నారు. ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రజలు గుమిగూడటంపై నిషేధం , భారీ సంఖ్యలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌, కంటైన్‌మెంట్‌ జోన్స్ ఏర్పాటు వంటి దశలను అమలు చేయాలని పేర్కొన్నారు.

కరోనా నిర్ధారణ పరీక్షలు, బాధితులకు వైద్యం వంటివి ఎక్కువగా చేపట్టాలని సూచించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అన్నారు. గతంలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్‌లను ఏ విధంగా విభజించామో మళ్ళీ అదేరకంగా జోన్ల ఆవశ్యకత ఉందన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/