బెంగళూరులో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ

ఒక్క రోజులోనే 2 వేల కొత్త కేసులు

Corona second wave boom in Bangalore
Corona second wave boom in Bangalore

Bangalore: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. పలు చోట్ల లాక్ డౌన్లు, నైట్ కర్ఫ్యూలను అమలు చేస్తున్నారు. కర్ణాటకపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. బెంగళూరులో కేసుల సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాత్రి విడుదలైన వివరాల ప్రకారం ఒక్క రోజులోనే బెంగళూరులో ఏకంగా 2 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో, వారం క్రితం బెంగళూరులోని జయానగర్ జనరల్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సదుపాయం కలిగిన 50 బెడ్లను ఏర్పాటు చేశారు. ఇప్పడు ఆ సంఖ్యను 100కు పెంచారు. ప్రస్తుతం దాదాపుగా అన్ని బెడ్లు పేషెంట్లతో నిండిపోయాయి.

కర్ణాటకలో గడిచిన 30 రోజుల్లో నమోదైన కేసులతో పోలిస్తే ప్రస్తుత కేసుల సంఖ్య 10 రెట్లు పెరిగిందని రాష్ట్ర ఆరోగ్య, వైద్య విద్య శాఖ మంత్రి సుధాకర్ తెలిపారు. లాక్ డౌన్ విధించేంతగా పరిస్థితులు ఇంకా దిగజారలేదని అభిప్రాయపడ్డారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలకు తప్పకుండా పాటించాలని మంత్రి సూచించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/