కరోనా కట్టడి చర్యలు పాటించాల్సిందే

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ట్వీట్

TS DGP Mahendar Reddy
TS DGP Mahendar Reddy

Hyderabad: కరోనా కట్టడి  చర్యలు పాటించాల్సిందేనని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

లాక్ డౌన్ సడలించినప్పటికీ మాస్కులు ధరించడం, శానిటైజర్లను ఉపయో గించడం, తరుచుగా చేతులు శుభ్రపరుచుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యలు  పాటించి తీరాలన్నారు.

కరోనా వ్యాక్సిన్‌ కనుగొనేంత వరకు భౌతిక దూరం అన్నది జీవన విధానంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. 

కరోనా బారిన పడకుండా ఓ వ్యక్తి తనను తాను రక్షించుకునేందుకు వీటన్నింటిని పాటించి తీరాలన్నారు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం :https://www.vaartha.com/specials/women/