లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడి

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో జిల్లాలో లాక్డౌన్ మరింత కఠనంగా అమలు చేస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన పలువురిని క్వారంటైన్లో ఉంచి పరీక్షీస్తున్నామని, తెలిపారు. కాగా ఖమ్మం జిల్లా పెద్దతండాలో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తికి, జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఏమి లేవని అన్నారు. అతను టీబీ పేషెంట్ కావడంతో వైద్యులు చికిత్స చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కాగా లాక్డౌన్ నిబందనలు ఉల్లంఘించే వారిపై కఠన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/