ఉపరాష్ట్రపతికి కరోనా పాజిటివ్
స్యయంగా ట్విట్టర్ లో వెల్లడి

New Delhi: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయింది. . దీంతో వెంకయ్య నాయుడు ప్రస్తుతం హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఈ విషయాన్ని స్వయంగా వెంకయ్యనాయుడు తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు.ఈరోజు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నాకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు తాను స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్లు చెప్పారు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలి. ” అని ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు ట్వీట్ లో పేర్కొన్నారు.
తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/