బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మష్రాఫ్ మోర్తాజాకు కరోనా పాజిటివ్
కుటుంబ సభ్యులకు ఇంతకుముందే సోకిన కరోనా

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మష్రాఫ్ మోర్తాజాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత వారం పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.
మోర్తాజా రెండు రోజులుగా అనా రోగ్యంతో బాధపడుతుండటంతో శుక్రవారం కరోనా పరీక్షలు నిర్వహిం చారు. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటి వ్‌గా తేలటంతో అతను ప్రస్తుతం తన నివాసం స్వీయ నిర్బంధంలో ఉన్నాడు.
రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని వైద్య పరీక్షల్లో కరోనా సోకినట్లు తేలిందని మోర్తాజా సోదరుడు బిన్ మోర్తాజా మీడియాకు తెలిపాడు.
కాగా మోర్తాజా కుటుంబ సభ్యులకు కొంతమందికి ఇంతకుముందే పాజిటివ్ పరీక్షించారు. ప్రస్తుతం మోర్తాజా బంగ్లాదేశ్ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నాడు.
మోర్తాజాతోపాటు వన్డే కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ అన్నయ్య అయిన బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ నఫీస్ ఇక్బాల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.
తను కరోనా వైరస్ బారిన పడ్డానని ప్రస్తుతం చిట్టగాంగ్‌లోని తన ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు నఫీస్ స్వయంగా ధ్రువీకరించినట్లు ఓ దిన పత్రిక వెల్లడించింది.
తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/