చంద్రబాబుకు కరోనా పాజిటివ్‌

స్వయంగా ట్విట్టర్ ద్వారా పోస్ట్

Corona positive to Chandra babu‌
Chandra babu‌ Naidu

Amaravati: టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఎంల్ తన ట్విట్టర్‌ వేదికగా ప్రకటన చేశారు. ” నాకు తేలిక పాటి లక్షణాలతో కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో నేను హోం ఐసోలేషన్‌ లో ఉన్నాను. వైద్యుల సలహా మేరకు అన్ని నిబంధనలను పాటిస్తున్నాను. నాతో గత కొన్ని రోజులుగా సన్నిహితంగా ఉన్న వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలి. ” అంటూ విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/