అచ్చెన్నాయుడు కు కరోనా పాజిటివ్

ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స

Atchannaidu
Atchannaidu

Guntur: టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కు కరోనా సోకింది. వైద్య పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

ఈఎస్ఐ కేసులో ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. నిన్న ఉదయం నుంచి ఆయన జలుబుతో బాధపడుతున్నారు.

దీంతో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలో ఆయనకు కరోనా నిర్ధారణ అయ్యింది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/