రక్షణశాఖ కార్యదర్శికి కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ: ఢిల్లీలోని రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ కు కరోనా వైరస్ సోకింది. స్వల్ప జ్వరంతో ఆయన బాధపడుతూ ఉండగా, ఆయనకు పరీక్ష చేసిన వైద్యులు వైరస్ సోకిందని తేల్చారు. ప్రస్తుతం ఆయన్ను హోమ్ క్వారంటైన్ లో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. కాగా ఆయన విధులు నిర్వహిస్తున్న సౌత్ బ్లాక్‌ను మూసివేశారు. ఈవిషయం తెలిసి సౌత్ బ్లాక్‌లోని పలువు రక్షణశాఖ ఉన్నతాధికారులు విధులకు హాజరు కాలేదు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా తన కార్యాలయానికి రాలేదని తెలిసింది. ఈసందర్భంగా సంబంధిత అధికారుల కాంటాక్ట్ ట్రేసింగ్ కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/