టిడిపి నేత బుద్ధా వెంకన్నకు కరోనా

ట్విట్టర్‌లో తెలిపిన బుద్ధా వెంకన్న

buddha venkanna
buddha venkanna

అమరావతి: ఏపిలో ఇప్పటికి పలువురు రాజకీయ నాయకులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా టిడిపి నేత బుద్ధా వెంకన్న కరోనా బారిన పడ్డారు. కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ అని తేలడంతో ఆయన వైద్యుల సూచనల మేరకు ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. కొన్ని రోజుల పాటు తాను రాజకీయాలకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు.

‘నాకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. 14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండమని డాక్టర్ సూచించారు. ఈ 14 రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటాను. నాకు దైవ సమానులైన మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అభిమానుల ఆశీస్సులతో కొవిడ్ ని జయించి, త్వరలోనే తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటాను’ అని బుద్ధా వెంకన్న చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/