బ్రిటన్‌ వైద్య ఆరోగ్య మంత్రికి కరోనా వైరస్‌

కొన్ని రోజులుగా జ్వరం, జలుబు.. వైద్య పరీక్షలు చేయడంతో కరోనా పాజిటివ్

britain Health minister Nadine Dorries
britain Health minister Nadine Dorries

లండన్‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఈనేపథ్యంలో బ్రిటన్‌ వైద్య ఆరోగ్య మంత్రి నాడిన్ డోరిస్ కు కరోనా వైరస్ సోకింది. గత కొన్ని రోజులుగా ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉండటంతో పాటు జ్వరం, జలుబుతో బాధపడుతూ ఉండటంతో వైద్యపరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉండాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం తాను వైద్యుల సలహాపై ముందుజాగ్రత్త చర్యగా ఇంట్లోనే ఓ గదిలో ఉంటున్నానని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. డోరీస్ గతంలో స్టేట్ ఫర్ హెల్త్ అండ్ సోషల్ కేర్, పార్లమెంటరీ అండర్ సెక్రటరీగానూ విధులు నిర్వర్తించారు. కాగా, యూకేలో కరోనా వైరస్ సోకిన తొలి ప్రజాప్రతినిధి డోరీస్. ఇప్పటివరకూ బ్రిటన్ లో 380 మందికి కరోనా సోకగా, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/