ఏపిలో 757 కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

కొత్తగా మరో 35 వెలుగులోకి

doctors
doctors

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్కరోజులోనే 35 కోత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 757 కు చేరినట్లు ఏపి వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా ఇప్పటి వరకు ఈ వైరస్‌ కారణంగా రాష్ట్రంలో మృతిచెందిన వారి సంఖ్య 22కు చేరింది. దీని బారినుండి కోలుకున్న వారి సంఖ్య 96 కుచేరగా ప్రస్తుతం 639 మంది ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నట్లు తెలిపింది. కాగా కొత్తగా నమోదయిన కేసులలో కర్నూలు జిల్లాలో 10, గుంటూరు జిల్లాలో 9, కడప జిల్లాలో 6, పశ్చిమగోదావరి జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 3, పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అత్యధిక కరోనా కేసులు నమోదు అయిన జిల్లా కర్నూలు. 184 కరోనా పాజిటివ్‌ కేసులతో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత 158 కేసులతో గుంటూరు రెండవ స్ధానంలో ఉంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/