పరవాడ జూనియర్ కళాశాలలో కరోనా కలకలం

దాదాపు రెండేళ్ల తర్వాత విద్యాసంస్థలు పున: ప్రారంభం అయ్యాయి. కరోనా ఉదృతి ఇంకా తగ్గకపోయినప్పటికీ విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా తల్లిదండ్రులు భయంతోనే తమ బిడ్డలను స్కూల్స్, కళాశాలలకు పంపిస్తున్నారు. అయితే ఇప్పుడు వరుస పెట్టి స్కూల్స్ లలో , కళాశాలలో కేసులు పెరుగుతుండడం అందర్నీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విద్యాసంస్థలు ప్రారంభమైనప్పటి నుండి కేసులు పెరుగుతున్నాయి.

తాజాగా విశాఖపట్నంలోని పరవాడ జూనియర్ కళాశాలలో ఐదుగురు విద్యార్థులు కోవిడ్ బారినపడ్డారు.. కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతోన్న విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురు స్టూడెంట్స్‌కు పాజిటివ్‌గా తేలింది. దీంతో.. అప్రమత్తమైన కాలేజీ యాజమాన్యం.. సోమవారం వరకు కాలేజీకి సెలవు ప్రకటించింది. ఇదిలా ఉంటె రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్ కు పిలుపునిచ్చాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం జీవో 53 విడుదల చేసింది. గ్రామ, మున్సిపాల్టీ, కార్పోరేషన్ వారీగా ఫీజులను నిర్ధారించింది. అయితే ఆ జీవో పై నిరసనలకు పిలుపునిచ్చారు ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు.