భారత్‌లో వేగంగా వ్యాపిస్తున్న కరోనా

2,902 కరోనా కేసులు, 68 మరణాలు.

corona virus
corona virus

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటి వరకు దేశంలో కరోనా భాధితుల సంఖ్య 2,902 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కాగా ఈ వైరస్‌ కారణంగా దేశంలో 68 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు ఈ వైరస్‌ బారినుండి 184 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 2,650 మంది ఆసుత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ వైరస్‌ తీవ్రత మహారాష్ట్రలో అధికంగా ఉంది. ఇక్కడ 423 మంది ఈ వైరస్‌ బారిన పడగా.. 19 మంది మరణించారు. అలాగే తమిళనాడులో 411 కరోనా కేసలు నమోదు అయ్యాయి. ఇక తెలంగాణలో 229 కరోనా కేసలు నమోదు కాగా.. 11 మంది మరణించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/