రెండొవసారి కరోనా బారినపడిన కర్ణాటక సీఎం

కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై రెండొవసారి కరోనా బారినపడ్డారు. గత జనవరిలోనూ ఒకసారి కరోనా బారినపడ్డారు. అప్పుడు కూడా ఆయన కరోనా స్వల్ప లక్షణాలతో హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఇప్పుడు మరోసారి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయానా ఆయనే అధికారికంగా తన ట్విట్టర్ ఖాతా వేదికగా ప్రకటించారు.
తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయిందని.. బసవరాజు తన ట్వీట్లో పేర్కొన్నారు. స్వల్ప కరోనా లక్షణాలతో తాను ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని, హోం ఐసోలేషన్‌లో ఉండాలని సీఎం బసవరాజు బొమ్మై విజ్ఞప్తి చేశారు. ఇక కరోనా బారినపడడం తో ఆయన ఢిల్లీ పర్యటన కూడా రద్దయింది.