కరోనాను జ‌యించిన రాజమండ్రి యువ‌కుడు..

నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్

కరోనాను జ‌యించిన రాజమండ్రి యువ‌కుడు..
Rajahmundry young man who conquered Corona .

Rajahmundry: వైద్యులు చెప్పిన సలహాలను పాటించడం వల్లే తనకు కరోనా నుంచి విముక్తి లభించిందని కరోనా నుంచి విముక్తి పొందిన రాజమండ్రి యువకుడు అన్నాడు

కరోనా సోకిన వెంటనే సరైన చికిత్స అందితే దానిని సులభంగా బయటపడవచ్చని, అందుకు తానే ఉదాహరణ అని అన్నాడు

తనకు ఎంతో ఓపికగా చికిత్స చేసిన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి , అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన జిల్లా ఉన్నతాధికారులకు, ప్రజా ప్రతినిధులకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు.

కాగా, కాకినాడలో మొదటి కరోనా పాజిటివ్ వ్యక్తి చికిత్స అనంతరం నెగిటివ్ రావడంతో శుక్రవారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రి నుంచి వైద్యులు సదరు వ్యక్తిని డిశ్చార్జ్ చేశారు.

లండన్ నుంచి వచ్చిన వ్యక్తి కరోనాపాజిటివ్ రావడంతో జీజీహెచ్ లో వైద్యం అందించారు. జిల్లా లో తొలి మొదటి పాజిటివ్ కేసు నమోదైంది.

గత కొన్ని రోజులుగా ఆ వ్యక్తి జీజీహెచ్ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్నాడు. శాంపిల్ చెక్ చేసిన తర్వాత, నెగిటివ్ రావడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి,జిల్లా ఎస్ పి అద్నాన్ నయిం అస్మి‌ ,కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిజీజీహెచ్ సూపర్డెంట్ డాక్టర్ రాఘవేంద్ర రావు సమక్షంలో ఇంటికి పంపారు

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/