గాలి ద్వారా కరోనా వ్యాప్తి..డ‌బ్ల్యూహెచ్‌‌వో స్పందన

ఈ వాద‌న‌ను కాద‌న‌లేం..అయితే, కచ్చితంగా మాత్రం చెప్పలేం

WHO

జెనీవా: కరోనా వైరస్‌ గాలిలోని సూక్ష్మ రేణువుల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని వందలాది పరిశోధకులు తమ వద్ద ఆధారాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈవిషయంపై తాజాగా డబ్ల్యూహెచ్‌వో స్పందించింది. ‌గాలి ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంద‌నే వాద‌న‌ను కాద‌న‌లేమ‌ని చెప్పింది. పరిశోధకులు చేస్తోన్న వాద‌న‌కు మ‌ద్ద‌తు ప‌లికింది. కొవిడ్‌19 వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తోందనేందుకు సాక్ష్యం ఉందని చెబుతూనే, ఆ విషయాన్ని కచ్చితంగా మాత్రం చెప్పలేమని కొవిడ్‌19 డబ్ల్యూహెచ్‌వో టెక్నికల్‌ లీడ్ చీఫ్‌ మారియా వాన్‌ కెర్ఖోవ్‌ తెలిపారు. కరోనా వ్యాప్తి చెందుతున్న పద్ధతుల్లో అది కూడా ఒక్కటై ఉండొచ్చన్నారు. గాలి ద్వారా వైరస్‌‌ వ్యాప్తికి సంబంధించిన ఆధారాలను సేకరించి విశ్లేషించి దానిపై మరింత స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని వివరించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/