వ్యాక్సిన్‌ పై డబ్ల్యూహెచ్‌వో కీలక వ్యాఖ్యలు

వచ్చే ఏడాది రెండో అర్ధభాగం తర్వాత కానీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు

corona vaccine

జెనీవా: కరోనా వ్యాక్సిన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. వివిధ దేశాలు అభివృద్ధి చేస్తున్న టీకాలన్నీ ప్రస్తుతం ప్రయోగదశలోనే ఉన్నాయని, ఏ దేశం కూడా ఇప్పటి వరకు అడ్వాన్స్ ట్రయల్స్ నిర్వహించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మార్గరెట్ హ్యారిస్ పేర్కొన్నారు. కాబట్టి వచ్చే ఏడాది రెండో అర్ధభాగం తర్వాత కానీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. వ్యాక్సిన్ ట్రయల్స్ మూడో దశ సుదీర్ఘంగా ఉంటుందని, ఈ సమయంలో వ్యాక్సిన్ ఎంత వరకు రక్షణ ఇస్తుందన్న విషయాన్ని పరిశీలించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన ఏ వ్యాక్సిన్ సమర్థత కూడా 50 శాతం ఉందన్న స్పష్టమైన సంకేతాలు అందలేదని హ్యారిస్ పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ఓ వాదన ఇలా ఉంటే అమెరికా మాత్రం అక్టోబరు చివరి నాటికి వ్యాక్సిన్ సిద్ధమవుతుందని ప్రకటించింది. నవంబరు 3న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అంతకంటే ముందే టీకాను అందరికీ అందుబాటులో తీసుకొస్తామని పేర్కొంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/