వియత్నంలో తొలి కరోనా మరణం

వియత్నంలో మొత్తం కేసులు 509

Vietnam records first Covid-19 deaths

హానోయ్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా వియత్నంలో తొలి కరోనా మరణం నమోదైంది. డానాంగ్‌లో ఇటీవల ఓ వృద్ధుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదే ఆ దేశంలో మొదటి కరోనా మరణమని స్థానిక మీడియా తెలిపింది.100 రోజుల తరువాత గతవారం డానాంగ్లో కరోనా కేసులు వెలుగు చూడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తక్షణ చర్యలకు ఉపక్రమించారు. డానాంగ్ నుంచి హానోయి వచ్చిన వారిందరికీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన కరోనా నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. జులై 1 నుంచి 29 వరకు డానాంగ్‌లో పర్యటించిన వారందరికీ గురువారం నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. శనివారం లోగా పరీక్షలు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. శుక్రవారం ఆ దేశంలో 45 కరోనా పాటిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదే ఇప్పటివరకు అత్యధికం. వియత్నంలో ఇప్పటివరకు కేవలం 509 మంది మాత్రమే కరోనా బారిపడ్డారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/