అమెరికాలో జూలైలో 25 వేల కరోనా మరణాలు..ఓ సర్వే

america
america


అమెరికా: అమెరికాలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతుంది. అయితే అక్కడ జూలై నెల‌లో క‌రోనా వైర‌స్ వ‌ల్ల 25 వేల మంది మ‌ర‌ణించారని, దేశంలోని 19 రాష్ట్రాల్లో కేసులు రెండింత‌లు అయిన‌ట్లు ఓ స‌ర్వే పేర్కొన్న‌ది. దీంతో అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ ఇప్ప‌ట్లో కుదుట‌ప‌డే అవ‌కాశాలు క‌నిపించ‌డంలేదు. జూలై నెల‌లోనే ఆ దేశంలో 1.87 మిలియ‌న్ల కొత్త కేసులు న‌మోదు అయిన‌ట్లు ఆ స‌ర్వే వెల్ల‌డించింది. దీంతో ఆ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ బారిన ప‌డ్డ‌వారి సంఖ్య 4.5 మిలియ‌న్లుగా ఉంది. జూలైలో మ‌ర‌ణాల రేటు 20 శాతం పెరిగింది. మొత్తం మ‌ర‌ణించిన వారి సంఖ్య 154000గా ఉంది. అత్యధికంగా ఫ్లోరిడాలో కేసులు న‌మోదు అయ్యాయి. ఆ రాష్ట్రంలో 3 ల‌క్ష‌లకు పైగా కేసులు న‌మోదు అయ్యాయి. ఆ త‌ర్వాత కాలిఫోర్నియా, టెక్సాస్ రాష్ట్రాలు నిలిచాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/