అమెరికాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా
నిన్న ఒక్కరోజులో ఏకంగా 91,295 కేసులు
అమెరికా: అమెరికాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుంది. నిన్న అమెరికాలో రికార్డు స్థాయిలో 91,295 కేసులు నమోదయ్యాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ నెల 15 నుంచి అమెరికాలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అమెరికాలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 90 లక్షలు దాటిపోయింది. ఒక్కరోజులో అత్యధికంగా కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో అమెరికా మరోసారి అగ్రస్థానానికి చేరింది.
కాగా, అమెురికా తర్వాత 80,88,851 కేసులతో భారత్ రెండో స్థానంలో ఉండగా, బ్రెజిల్ 54,96,400 కేసులతో మూడో స్థానంలో ఉంది. నిన్న బ్రెజిల్లో 26 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అలాగే, రెండో వేవ్ మొదలైన ఫ్రాన్స్, యూకేల్లోనూ కరోనా విజృంభణ ఉద్ధృతంగా వుంది. నిన్న ఫ్రాన్స్ లో ఏకంగా 47,000 కేసులు నమోదుకాగా యూకేలో 23,000కి పైగా కేసులు నిర్ధారణ అయ్యాయి.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/