త్వరలోనే అందుబాటులోకి కరోనా వ్యాక్సిన్‌

భారత్‌ బయోటెక్‌ను సందర్శించిన తెలంగాణ గవర్నర్‌

governor-tamilisai-soundararajan

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై శామీర్‌పేట‌లోని భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌ను మంగ‌ళ‌వారం సంద‌ర్శించారు. ఈ సందర్భంగా ఆమె కొవిడ్ వ్యాక్సిన్ త‌యారీలో భాగ‌స్వాములైన శాస్ర్త‌వేత్త‌ల‌తో గ‌వ‌ర్న‌ర్ మాట్లాడారు శాస్ర్త‌వేత్త‌లు వ్యాక్సిన్‌పై అత్యంత శ్ర‌ద్ధ పెట్టి ప‌ని చేస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌ధాని మోడి చెప్పిన‌ట్లు భార‌త్‌లోనే క‌రోనా వ్యాక్సిన్ త‌యారీకి అవ‌కాశాలు ఎక్కువ అని పేర్కొన్నారు. వ్యాక్సిన్ కోసం అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్న శాస్ర్త‌వేత్త‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌లు రాకుండా వ్యాక్సిన్ త‌యారీపై దృష్టి పెట్టార‌ని చెప్పారు. త‌క్కువ ధ‌ర‌లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. భార‌త్ బ‌యోటెక్ ప్ర‌పంచ వ్యాప్తంగా వ్యాక్సిన్లు పంపిణీ చేస్తోంద‌ని గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/