ఆగస్టు 31 వరకు తమిళనాడులో లాక్‌డౌన్‌

ప్రతీ ఆదివారం పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

Tamil Nadu government lockdown extended till August 31

చెన్నై: తమిళనాడులో కరోనా వ్యాపి కొనసాగుతుంది. ఈనేపథ్యంలో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతీ ఆదివారం పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించనుండగా మిగతా రోజుల్లో కొన్నింటికి సడలింపులు ఇచ్చారు. లాక్‌డౌన్‌ గడువు శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పళనిస్వామి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్రాష్ట రవాణాపై నిషేధం కొనసాగనుంది. అంతర్‌జిల్లా ప్రయాణానికి ఈపాస్‌ తప్పనిసరిచేసింది. పార్కులు, బీచ్‌లు, సినిమాహాళ్లు, విద్యాసంస్థల బంద్‌ కొనసాగుతుందని తెలిపింది. తమిళనాడులో ప్రస్తుతం 57వేల కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 1.7లక్షలకు పైగా కరోనా బాధితులు కోలుకున్నారు. కరోనా బారినపడి 3,471 మంది మరణించారు. దేశవ్యాప్తంగా అన్‌లాక్‌ 2.0 గడువు ఈనెల 31వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే అన్‌లాక్‌ 3.0 నిబంధనలను విడుదల చేసిన విషయం తెలిసిందే.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/