వైరస్‌ భారిన పడకుండా ఈ జాగ్రత్తలు ..మంత్రి ఈటల

ఈ జాగ్రత్తలు పాటిద్దాం… వైరస్‌ వ్యాప్తిని అరికడదాం

Minister Etela Rajender

హైదరాబాద్‌: రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు పిలుపునిచ్చారు. తగు జాగ్రత్తలు పాటిస్తూ కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికడదాం అని ఆయన అన్నారు. వైరస్‌ భారిన పడకుండా ఉండేందుకు ఈ జాగ్రత్త చర్యలు పాటిద్దామన్నారు.

•స్నేహితులు, సన్నిహితులను కలిసినప్పుడు షేక్‌ హ్యాండ్‌ను ఇవ్వకుండా నమస్కారం పెట్టడం

•ముక్కు, కళ్లు, నోటిని చేతులతో పదే పదే ముట్టుకోకుండా ఉండటం

•చేతులను తరచుగా సబ్బు నీటితో గాని, హ్యాండ్‌ శానిటైజర్‌తో గాని శుభ్రపరుచుకోవడం

•జన సమూహంలో తిరుగుతున్నప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించడం

•రద్దీగా ఉన్న ప్రాంతాలకు వెళ్లడం తగ్గించడం

•జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారికి దూరం పాటించడం వంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటూ వైరస్‌ భారిన పడకుండా సురక్షితంగా ఉందామని పేర్కొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/