స్వీయరక్షణే ఇక శ్రీరామరక్ష

సమష్టి కృషితో కరోనాను నియంత్రించాలి

self-defense-Corona control

మానవజాతిని పట్టిపీడిస్తూ అసువులు తీస్తున్న కరోనా మహమ్మారిని నియం త్రించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నా ఆ రాక్షసి ఉధృతి కొనసాగిస్తూనేఉంది.

ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోటి నాలు గులక్షల మందికి పైగా సోకిన ఈ వైరస్‌ ఐదులక్షల పదివేల మందిని బలి తీసుకున్నది. ఇంకా ఈ మారణ హోమం కొనసాగిస్తూనే ఉన్నది.

ఎంతకాలం ఈ మహమ్మారి ప్రజారోగ్యంపై దాడి చేస్తుందో? ఎప్పటికి మందులు నివారణ చర్యగా టీకాలు వస్తాయో ఇతిమిద్దంగా చెప్పలేని పరిస్థితి. ప్రపంచ వ్యాప్తంగా వైద్యరంగ నిపుణులు, శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ కనుగొనేందుకు రాత్రింబ వళ్లు శ్రమిస్తూనే ఉన్నారు.

మరొకపక్క వైరస్‌బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గూర్చి పెద్దఎత్తున ప్రచారం, హెచ్చరికలతో కేంద్ర,రాష్ట్ర పాలకులు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు.

మంగళవారం దేశ ప్రధాని నరేంద్రమోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ వైరస్‌ కారణంగా ఏర్పడిన ఇబ్బందులను గట్టెక్కించేం దుకు ముఖ్యంగా నిరు పేదలు ఆకలికి అల్లాడకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.

భారత్‌లోని దాదాపు ఎనభై కోట్ల మంది నిరుపేదలకు ఉచిత ఆహార ధాన్యాలు, దినుసులు ఇవ్వ నున్నట్లు ప్రకటించారు.

ఇందు కోసం కేంద్రం తొంభైవేల కోట్లరూపాయల వరకు వెచ్చిం చనున్నట్లు వివరించారు. పేదల ఆహార భద్రతకోసం గత మూడు నెలలుగా కేంద్ర ప్రభుత్వం లక్షాయాభైవేల కోట్లు ఖర్చు చేసినట్లు అవ్ఞతుందని ఆయన వివరించారు.

ముఖ్యంగా రాబోయే ప్రధానమైన పండుగల్లో పేదలు ఆకలితో పస్తులు ఉండ కూడదనే ఉద్దేశంతోనే ఈనిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు పౌరసమాజంలో అనేక మంది సహాయ సహకారాలు అందించడం వల్లనే ఇది సాధ్యమైందని వివరిం చారు.

అలాగే ‘ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన ద్వారా మూడు నెలల పాటు ఎనభైకోట్ల మందికి ఉచిత రేషన్‌ పంపిణీ చేసినట్లు కూడా ప్రధాన మంత్రి చెప్పుకొచ్చారు.

అయితే లాక్‌డౌన్‌ సమయంలో నియమ నిబంధనలు పాటించిన ప్రజల్లో అన్‌లాక్‌ తర్వాత నిర్లక్ష్యం పెరిగిందని ప్రధాని ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. మరింత జాగ్రత్తగా ఉండాల్సిన తరుణంలో ఇది ఏమాత్రం మంచిదికాదని హెచ్చరించారు.

కరోనాపై పోరా డుతూ బుధవారం నుంచి అన్‌లాక్‌ టూలోకి ప్రవేశిస్తు న్నామని, కంటైన్‌మెంట్‌ జోన్లపై మరింత దృష్టిసారించా ల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి అన్న మాటల్లో ఎంతో వాస్తవం ఉంది.

లాక్‌డౌన్‌ ఎత్తి వేసిన తర్వాత చాలా రాష్ట్రాల్లో నిబంధనలను ఏమాత్రం పట్టించుకోలేదు. జాగ్రత్తల సంగతి అలా వదిలిపెడితే కరోనా వైరస్‌ నియంత్రణకు సహకరించరేమోనన్నట్లుగా కొందరు వ్యవహరించారు.

ఫలితంగా కరోనా విలయతాండవం చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వర్షాకాలం ఆరంభంకావడంతో పరిస్థితి మరింత ఆందోళనక రంగా మారుతున్నది. వానాకాలం సాంక్రమిత వ్యాధుల ముప్పుపొంచి ఉన్నట్లు వైద్యరంగ నిపుణులే చెప్తున్నారు.

గత రెండు, మూడు దశాబ్దాలుగా వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తూ ప్రజా రోగ్యంపై దాడి చేస్తూనే ఉన్నాయి. ఈ సారి కూడా అలాం టి ప్రమాదమే ఉందని డాక్టర్లు హెచ్చరిస్తూనే ఉన్నారు.

అయితేవిలయతాండవం చేస్తున్న కరోనాను నివారించేందుకు సతమతమవుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీజన్‌ల్‌ వ్యాధులు సోకుండా ముందుగా చేపట్టే చర్యలు తీసుకోలేక పోతున్నారు.

వ్యాధినిరోధక టీకాల కార్యక్రమాలను అలాగే ఇతర రోగని రోధక చర్యలను వాయిదా వేసినట్లుగా కనబడుతుంది. ఇందుకు వారికి ఉన్న కారణాలు వారికి ఉండవచ్చు.కానీ సాంక్రమిత వ్యాధులు ముసురు ఆరంభమైనట్టుగా తెలు స్తున్నది.

డెంగ్యూ, చికెన్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్‌, డయేరియా విష జ్వరాలు కలరా, మెదడువాపు వ్యాధి లాంటి వ్యాధులు సాధారణంగా వానాకాలంలో విస్తరిస్తుం టాయి.

ఇక జలుబు, దగ్గు, జ్వరం వంటివి సాధారణమై పోయాయి.అయితే ఇవి కూడా కరోనానే మోననే భయంతో ప్రజలు వణికిపోతున్నారు.

ఇక కలుషిత నీరు, ఆహారం, గాలి, దోమల ద్వారా వ్యాప్తిచెందే డెంగ్యూ, మలేరియా, చికెన్‌ గున్యా,డయేరియా, కామెర్లు లాంటి వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

కానీ ఆవైపు చూసేందుకు కూడా వైద్యులకు సమ యం దొరకడంలేదు.పూర్తిగా కరోనా నివారణలోనే మునిగిపో యారు.

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలకు అనుమ తులు ఇచ్చినా కొన్ని ల్యాబ్‌లు చేతివాటం చూపుతున్నాయి. లేనివారికి ఉన్నట్టు, ఉన్న వారికి లేనట్టు రిపో ర్టులు ఇస్తుండటంతో ప్రజలు గందరగోళంలో పడుతు న్నారు.

దేశవ్యాప్తంగా కూడా ఈ పరీక్షా కేంద్రాలపై సమగ్రమైన చట్టంకానీ, నిబంధనలు కానీ లేకపోవడంతో కొన్ని పరీక్షా కేంద్రాల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా మారిపోయాయి.

ఎందుకో ఏమోకానీ ప్రజారోగ్యంపై ప్రభుత్వం చూపాల్సి నంత శ్రద్ధ వహించడం లేదేమోననిపిస్తున్నది.

మరొకపక్క కిడ్నీ, గుండెజబ్బులు, కేన్సర్‌లాంటి వ్యాధులు పెరిగిపోతు న్నాయి.ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

ఇంకొకపక్క ప్రైవేట్‌ వైద్యం సామాన్యుడికి అందు కోలేనంతగా పెరిగిపోతున్నది.వైద్యం ఒక వ్యాపారంగా రూపాంతరం చెందింది.

కార్పొరేట్‌రంగం ప్రవేశించిన తర్వా త అప్పటి నుండి వైద్యం అనేది బీదాబిక్కి బడుగువర్గాలకే కాదు మధ్యతరగతి వారికి కూడా అందని పండుగా తయారైంది.

ఇందుకు పాలకులను నిందించే కంటే ప్రధానమంత్రి అన్నట్టు ప్రజల నిర్లక్ష్యం,జాగ్రత్తలు తీసుకోక పోవడం కూడా కారణాలనేది వాస్తవం.

ఈ ప్రమాదకర పరి స్థితుల్లో ప్రజలు,స్వచ్ఛంద సంస్థలు ఎవరికి వారుగా ఆరో గ్యాన్ని కాపాడుకోవాలి.

సమష్టి కృషితోనే కరోనానుకానీ, మరే ఇతర విషజ్వరాలను కానీ నియంత్రించవచ్చు.అన్నిం టికంటే మించి స్వీయరక్షణే మన ముందున్న కర్తవ్యం.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/