రష్యాలో 7.5 లక్షలు దాటిన కరోనా కేసులు

24 గంటల్లో రష్యాలో 6,428 కొత్త కేసులు

coronavirus -russia
coronavirus -russia

మాస్కో: కరనా మహమ్మారి ప్రపంచదేశాలు వణికిస్తుంది. రష్యాలో గత కొన్నివారాలుగా ప్రతిరోజూ సగటున 6వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో రష్యాలో 6,428 మందికి కొవిడ్‌19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా కారణంగా ఒక్కరోజే 167 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,52,797కు చేరింది. కరోనాబారినపడి మరణించిన వారి సంఖ్య 11,937కు పెరిగింది. కరోనా బాధిత దేశాల్లో రష్యా నాలుగో స్థానంలో ఉన్నది. కాగా రష్యాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య ఏడున్నర లక్షలు దాటింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/