హోం ఐసోలేషన్‌లో రవిశంకర్ ప్రసాద్

ఆరోగ్యంగానే ఉన్నారని ప్రసాద్‌ కార్యాలయం వెల్లడి

Ravishankar Prasad at Home Isolation
Ravishankar Prasad at Home Isolation

New Delhi: : కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్వీయ ఐసొలేషన్‌లో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను శనివారం కలిసిన నేపపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

అమిత్‌ షాకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా ఆదివారం పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో తనను కలిసిన వారంతా హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని ఆయన సూచించారు.

ఈ నేపథ్యంలో అమిత్‌ షాను కలిసిన పలువురు ఐసొలేషన్‌లో ఉంటున్నట్లు చెప్పారు.

ఈ నేపథ్యంలో తాను కూడా స్వీయ ఐసొలేషన్‌ విధించుకున్నట్లు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు.

మరోవైపు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని రవిశంకర్‌ ప్రసాద్‌ కార్యాలయం తెలిపింది.

తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/