లాక్‌డౌన్‌ పొగిడిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ

కంటైన్మెంట్ జోన్లలో జులై 31 వరకు లాక్‌డౌన్‌

telangana-government-orders-lockdown-extension-in-containment-zones

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని  కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ జీవో జారీ చేసింది. కేంద్ర హోంశాఖ నిబంధనల ప్రకారం కంటైన్‌మెంట్ జోన్లలో జూలై 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేర్కొన్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని వెల్లడించింది. అయితే వీటి నుంచి ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపు ఇచ్చింది. మరోవైపు రాత్రి 9.30 గంటల కల్లా అన్ని షాపులు మూసేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసర సేవలకు సంబంధించిన వారికి మాత్రమే బస్సులు, రైళ్లు, విమానల ద్వారా ప్రయాణానికి అనుమతి ఉంటుంది. లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేయాలని కలెక్టర్లకు ఆదేశించింది. కొత్త మార్గదర్శకాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/