జర్మనీలో 24 గంటల్లో 249 కొత్త కేసులు

germany-corona virus-cases

బెర్లిన్‌: జర్మనీలో కరోనా ఉద్ధృతి కొనగుతుంది. అక్కడ గడిచిన 24 గంటల్లో 249 కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2,01,823కు చేరింది. మరోపక్క గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా బారిన పడి ఇద్దరు మరణించారు. దీంతో జర్మనీలో ఇప్పటివరకు కరోనా కారణంగా 9,086 మంది మృత్యువాతపడ్డారు. ఇక ఇప్పటివరకు1,87,800 మంది పూర్తిగా కోలుకున్నారు. కాగా.. జర్మనీలో అత్యధిక కేసులు బవేరియా నుంచే నమోదవుతున్నాయి. బవేరియాలో ఇప్పటివరు 49,775 కేసులు బయటపడ్డాయి. ఆ తరువాత నార్త్ రైన్ వెస్ట్‌ఫాలియాలో 46,075 కేసులు.. బడేన్ వర్టెమ్‌బర్గ్‌లో 36,342 కేసులు నమోదయ్యాయి. ఇక జర్మని రాజధాని బెర్లిన్‌లో మొత్తంగా 8,779 కేసులు బయటపడ్డాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/