మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా

ఇటీవల తనను కలిసిన వారూ పరీక్షలు చేయించుకోవాలని సూచన

Pranab Mukherjee

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. తాజాగా భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ప్రత్యేక కార్యక్రమంపై తాను ఆసుపత్రికి వెళ్లానని, ఈ సందర్భంగా కరోనా పరీక్ష చేయించుకోగా తనకు వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఆయన ప్రకటించారు. ఇటీవల తనను కలిసిన వారు కూడా ఐసొలేషన్‌లో ఉండి, పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు ఐసోలేషన్‌లో ఉంటూ ప్రణబ్‌ ముఖర్జీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా కరోనా బారిన పడిన ప్రణబ్ ముఖర్జీ చికిత్స కోసం ఆర్మీ ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు తెలుస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/