ఢిల్లీలో రెండోసారి కరోనా వైరస్‌ విజృంభణ

cm-arvind-kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా వైరస్‌ రెండోసారి విజృంభించిందని సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. రోజువారీ పాజిటివ్‌ కేసుల నమోదు 4 వేలు దాటుతున్నది. దీంతో ఢిల్లీలో రెండోసారి కరోనా వైరస్‌ విజృంభిస్తున్నట్లు నిఫుణులు చెబుతున్నారని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం చెప్పారు. ఈ నెల 16న రికార్డు స్థాయిలో 4,500 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపారు. అనంతరం రోజువారీ వైరస్‌ కేసుల నమోదు సంఖ్య కాస్త తగ్గినట్లు కనిపించిందని, అయితే గత 24 గంటల్లో మరోసారి 3,700కు పెరిగినట్లు కేజ్రీవాల్‌ తెలిపారు.

ఈ నెల 15 నుంచి 19 వరకు వరుసగా ఐదు రోజులపాటు రోజువారీ కరోనా కేసుల నమోదు సంఖ్య నాలుగువేలకు పైగా ఉన్నదని చెప్పారు. సెప్టెంబర్‌ 15న 4,263 కేసులు, 36 మరణాలు, 16న 4,473 కేసులు, 33 మరణాలు, 17న 4,432 కేసులు 38 మరణాలు, 18న 4,127 కేసులు, 30 మరణాలు, 19న 4,071 కేసులు 38 మరణాలు నమోదైనట్లు గణాంకాల ద్వారా తెలుస్తున్నదని కేజ్రీవాల్‌ అన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రెండోసారి కరోనా వైరస్‌ విజృంభిస్తున్నట్లు నిఫుణులు అభిప్రాయపడుతున్నారని చెప్పారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/